లాటరీ ద్వారా మద్యం బార్ల ఎంపిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో మద్యం షాపులకు లాటరీ తీసి ఎంపిక చేశారు. ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో రెండు బార్లకు నాలుగు దరఖాస్తులు రాగా వాటికి లాటరీ తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్‌శాఖ అధికారులు, బార్ లైసెన్స్ దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ ముగిసిందన్నారు. ధర్మవరం టౌన్‌లో ప్రకటించిన రెండు బార్లలో ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తు వచ్చాయి. అందులో ఒకటి డోలా రాజారెడ్డికి , మరోటి లక్ష్మీనారాయణ దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌శాఖ అధికారి గోవిందనాయక్, అసిస్టెంట్ ఎకై ్సజ్ అధికారి నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆటో నుంచి కిందపడి మహిళ మృతి
పరిగి/గుడిబండ: పరిగి మండలంలోని పరిగి పెద్ద చెరువు కింద పన్నేడమ్మ గుడి సమీపంలో గొల్ల లక్ష్మమ్మ (50) అనే మహిళ ఆటోలో ప్రయాణిస్తూ నిద్ర మత్తులో జారిపడి కింద పడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. ఎస్‌ఐ రంగడుయాదవ్ వివరాలమేరకు... మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ పదేళ్ల క్రితం జరిగిన విద్యుదాఘాతంతో భర్త నారాయణప్పను కోల్పోయింది. పొలం పనులకు వెళ్లే లక్ష్మమ్మ... సీజన్ కావడంతో ప్రస్తుతం చింతపండును సేకరించి కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఇటీవల సేకరించిన చింతపండును సంచుల్లో నింపుకుని అమ్మడానికి గురువారం వేకువజామున తన స్వగ్రామం నుంచి ఆమెతో పాటు నారాయణప్ప అనే మరో వ్యక్తి ఆటోలో హిందూపురానికి బయలుదేరారు. ఈక్రమంలో పరిగి వద్దకు చేరుకోగానే నిద్రమత్తులో ఉన్న లక్ష్మమ్మ ఆటో నుంచి జారిపడి కింద పడిపోయింది. చికిత్స నిమిత్తం హిందూపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతురాలి కుమారుడు అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
లాటరీ ద్వారా మద్యం బార్ల ఎంపిక


