సందర్భం: | - | Sakshi
Sakshi News home page

సందర్భం:

Feb 4 2026 6:59 AM | Updated on Feb 4 2026 6:59 AM

సందర్

సందర్భం:

హిందూపురం టౌన్‌: ప్రస్తుతం సమాజాన్ని క్యాన్సర్‌ భూతం పట్టిపీడిస్తోంది. గతంతో పోల్చితే క్యాన్సర్‌ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గ్రామాల్లో అవగాహన లేక గతంలో క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేవారుకాదు. ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స చేయించుకోవాలనే ఆలోచన వస్తోంది. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పెరగడం వల్ల వ్యాధి ఎంతమందికి ఉందో తెలుస్తోంది.

భయం వద్దు..

చాలా మంది క్యాన్సర్‌ అనగానే ఇక అంతేనంటూ భయాందోళన చెందుతారు. అయితే ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను కూడా ఆత్మవిశ్వాసంతో జయించవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రాథమిక దశలో దానిని గుర్తించి చికిత్స పొందడం ద్వారా మరణాన్ని జయించవచ్చని, ఇప్పటికే ఎంతో మంది ఈ తరహా చికిత్స తీసుకుంటూ బతికి బయటపడ్డారని వివరిస్తున్నారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలంటున్నారు.

వీటిని దూరం పెట్టాల్సిందే..

ఖైనీ, గుట్కా, పాన్‌ పరాగ్‌, డీలక్స్‌, పొగాకు వంటివి తినడం, పొగ తాగడం వల్ల క్యాన్సర్‌ వ్యాధి సోకుతుంది. నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వీటి వల్లే వస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ జన్యుపరమైన కారణాలతో వస్తుంది. బయట ఫుడ్స్‌ తినడం వల్ల జీర్ణాశయ క్యాన్సర్‌ వస్తుంది. ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, గడ్డలు ఏర్పడటం, రొమ్ము వద్ద చనుమొనలో ద్రవం కారడం, చర్మంలో మార్పు, పురీషనాళంలో నొప్పి, నిరంతర దగ్గు, కఫంలో రక్తం పడటం, ఛాతినొప్పి, భరించలేని తలనొప్పి,వికారం, వాంతులు, అవయవాల్లో బలహీనత వంటివి క్యాన్సర్‌ లక్షణాలు. చిన్న పరిమాణపు క్యాన్సర్‌ లేదా ప్రాథమిక దశల్లో ఉన్న వాటికి చికిత్స చేయడం సులభం.

కారణాలు

క్యాన్సర్‌ వ్యాధి రావడానికి 4 శాతం జన్యుపరంగా, 6 శాతం తీసుకునే నీరు, ఆహారం, 15 శాతం స్థూలకాయం, 40 శాతం పొగాకు, 10 శాతం ఇన్ఫెక్షన్లు కారణమవుతాయి. మిగిలిన 25 శాతం క్యాన్సర్లకు సరైన కారణాలు లేవు.

నాలుగు దశలు

క్యాన్సర్‌లో నాలుగు దశలు ఉన్నాయి. మొదటి దశలో క్యాన్సర్‌ కణాల్ని స్క్రీనింగ్‌ ద్వారా గుర్తించి సరైన చికిత్స అందించవచ్చు. ఇలా చేయడం ద్వారా 95 నుంచి 100 శాతం వరకు వ్యాధి నయం చేయవచ్చు. రెండో దశలో క్యాన్సర్‌ కణాలు ఒక భాగం నుంచి ఇతర భాగాలకు కొంచెం, కొంచెంగా విస్తరించడం ప్రారంభమవుతుంది. వాటికి రేడియోథెరఫీ అందిస్తే 70 నుంచి 80 శాతం వరకు పూర్తి స్థాయిలో నయమవుతుంది. ఇక మూడో దశలో క్యాన్సర్‌ ఇతర భాగాలకు పూర్తిగా విస్తరిస్తుంది. రేడియోథెరపీ, కీమోథెరపీ ఇస్తే 50 నుంచి 60 శాతం మందికి తగ్గుముఖం పడుతుంది. ఇక చివరి దశలో క్యాన్సర్‌ కీలకమైన అవయవాలకు సోకుతుంది. ఇలాంటి వారికి చికిత్స అందించినా ఆశించిన ఫలితం ఉండదు. కేవలం 5 నుంచి 10 శాతం మంది మాత్రమే బతికే అవకాశాలుంటాయి.

క్యాన్సర్‌లో రకాలు

క్యాన్సర్‌లో పలు రకాలు ఉన్నాయి. మహిళల్లో సాధారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్లు సోకే అవకాశం ఉంటుంది. పురుషుల్లోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌, చిన్నపిల్లల్లో బ్లడ్‌ క్యాన్సర్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్‌ను పలు పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. ఎఫ్‌ఎన్‌ఎసీ, పాప్సిమీర్‌, బయాప్సీ పరీక్షల ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు.

జిల్లాలో పెరుగుతున్న బాధితులు

సకాలంలో గుర్తిస్తే మేలు

అలసత్వం వీడాలంటున్న

వైద్య నిపుణులు

నేడు వరల్డ్‌ క్యాన్సర్‌ డే

సంకేతాలిలా..

మలమూత్ర విసర్జనలో మార్పులు

దీర్ఘకాలం మానని పుండ్లు, అసహజ రక్తస్రావం

గొంతు బొంగురుపోవడం

నొప్పి లేకుండా పెరుగుతున్న కణితులు, శరీరంలో ఎక్కడైనా ముద్దలు

తీవ్రమైన అలసట, బలహీనత

పుట్టుమచ్చల్లో సహజ మార్పులు

సందర్భం:1
1/3

సందర్భం:

సందర్భం:2
2/3

సందర్భం:

సందర్భం:3
3/3

సందర్భం:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement