వైభవం.. చెన్నకేశవుని తడకోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. చెన్నకేశవుని తడకోత్సవం

Feb 8 2026 4:24 AM | Updated on Feb 8 2026 4:24 AM

వైభవం

వైభవం.. చెన్నకేశవుని తడకోత్సవం

పుట్టపర్తి: బుక్కపట్నం మండల పరిధిలోని చండ్రాయునిపల్లి సమీపంలో కొండలో వెలసిన చెన్నకేశవ స్వామి తడక మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం తరుగు వంశీయులు తీసుకొచ్చిన తడకను స్వామి వారి ఆలయంపై కప్పారు. అనంతరం తరుగు వంశీయులు వేలాది మంది భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.

కిక్కిరిసిన చండ్రాయునికొండ..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చెన్నకేశవ స్వామి ఆలయానికి చేరుకునేందుకు నూతనంగా రోడ్డు వేసింది. దీంతో ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా తండోప తండాలుగా భక్తులు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు దారి మధ్యలో భక్తుల సౌకర్యార్థం తాగునీటిని ఏర్పాటు చేశారు.

వైభవం.. చెన్నకేశవుని తడకోత్సవం 1
1/2

వైభవం.. చెన్నకేశవుని తడకోత్సవం

వైభవం.. చెన్నకేశవుని తడకోత్సవం 2
2/2

వైభవం.. చెన్నకేశవుని తడకోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement