పక్కాగా ‘పది’ పరీక్షల నిర్వహణ
ప్రశాంతినిలయం: పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నిర్వహించే ప్రీఫైనల్ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం బుక్కపట్నం మండలం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రీఫైనల్ పరీక్షలకు ప్రతి విద్యార్థి హాజరయ్యేలా చూడాలన్నారు. మెరుగైన బోధన అందించి పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ వెంట డిఈఓ కిష్టప్ప ఉన్నారు. అనంతరం సత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులతో పలు విషయాలపై చర్చించారు.
అందరికీ ఉపాధి అవకాశాలు
నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. మంగళవారం బుక్కపట్నంలో ఏపీ రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణను ఆయన పరిశీలించారు. యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలన్నారు.


