చెట్టును ఢీకొన్న టాటా ఏస్‌ | - | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న టాటా ఏస్‌

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

చెట్టును ఢీకొన్న టాటా ఏస్‌

చెట్టును ఢీకొన్న టాటా ఏస్‌

మడకశిరరూరల్‌: మండలంలోని యూ రంగాపురం వద్ద జాతీయ రహదారిలో సోమవారం ఓ టాటా ఏస్‌ వాహనం చెట్టును ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. రెండు రోజుల క్రితం వాహనంలో లోడ్‌ వేసుకుని బెంగళూరు వెళ్లిన పావగడకు చెందిన శివ, దుర్గాప్రసాద్‌లు ఆదివారం రాత్రి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలో యూ రంగాపురం వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో వాహనం ముందుభాగం తీవ్రంగా దెబ్బతినగా, అందులో శివ, దుర్గాప్రసాద్‌ ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఇద్దరినీ బయటకు తీశారు. శివకు కుడికాలు, దుర్గాప్రసాద్‌కు ఎడమ కాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటనే వారిని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మొరుగైన చికిత్సల కోసం హిందూపురం తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement