కోర్టు భవనాల నిర్మాణానికి సహకరించండి | - | Sakshi
Sakshi News home page

కోర్టు భవనాల నిర్మాణానికి సహకరించండి

Feb 11 2026 8:47 AM | Updated on Feb 11 2026 8:47 AM

కోర్టు భవనాల నిర్మాణానికి సహకరించండి

కోర్టు భవనాల నిర్మాణానికి సహకరించండి

జిల్లా జడ్జికి పురం న్యాయవాదుల వినతి

హిందూపురం: స్థానిక కోర్డు భవనాల నిర్మాణంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని జిల్లా జడ్జి భీమారావును హిందూపురం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వన్నేరువప్ప, న్యాయవాదులు కృష్ణమూర్తి, శివశంకర్‌ విన్నవించారు. ఈ మేరకు జిల్లా జడ్జిని అనంతపురంలోని జడ్జి చాంబర్‌లో కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రిన్సిపల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు న్యాయమూర్తిని నియమించాలని కోరారు. పాతబడిన బిల్డింగులను తొలగించి, నూతన భవనాలను నిర్మించాలని విన్నవించారు. ఇందుకు జిల్లా న్యాయమూర్తి సానుకూలంగా స్పందిస్తూ ఏపీ ఉన్నత న్యాయస్థానానికిప్రతిపాదనలు పంపనున్నట్లు హామీనిచ్చారని న్యాయవాదులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement