● అ‘పూర్వ’ సమ్మేళనం
పరిగి: స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో 2004–05 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సెల్ఫీలు తీసుకున్నారు. విద్యనభ్యసించిన తరగతి గదుల్లో సంచరిస్తూ సందడి చేశారు. అనంతరం తమకు విద్య నేర్పిన గురువులను సన్మానించారు. పాఠశాలకు రూ.30 వేలు విలువైన ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్‌ను అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కృపాసత్యరాజు, లక్ష్మయ్య, ప్రభాకర్, సురేష్, వహీదాఖాన్, చందనశ్రీ, రామాంజి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


