ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసులకు ప్రీ పెయిడ్‌ మీటర్లు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసులకు ప్రీ పెయిడ్‌ మీటర్లు

Feb 10 2026 8:08 AM | Updated on Feb 10 2026 8:08 AM

ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసులకు ప్రీ పెయిడ్‌ మీటర్లు

ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసులకు ప్రీ పెయిడ్‌ మీటర్లు

తిరుపతి రూరల్‌: ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యుత్‌ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్‌ మీటర్లకు ప్రీ–పెయిడ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్‌ లోతేటి తెలిపారు. స్థానిక ఏపీఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్లు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లతో సోమవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సీఎండీ మాట్లాడారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 8,136, శ్రీసత్యసాయి జిల్లాలో 6,717 సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లను అమర్చినట్లు వివరించారు. ఈ సర్వీసులన్నింటినీ ప్రస్తుతం ప్రీ పెయిడ్‌ మీటర్లుగా మారుస్తున్నామని, రీఛార్జ్‌ చేసేందుకు వీలుగా ఈ–వాలెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. దశలవారీగా మిగిలిన కేటగిరీలకూ ప్రీ–పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

డయల్‌ యువర్‌ సీఎండీకి 39 వినతులు..

ఏపీఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 39 వినతులు అందాయి. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని సీఎండీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు గురవయ్య, పి.అయూబ్‌ఖాన్‌, కె.రామమోహన్‌రావు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు కె. ఆదిశేషయ్య, ఆర్‌.పద్మ, జె.రమణాదేవి, ఎం.ఉమాపతి, ఎం.మురళీకుమార్‌, ఎం.కృష్ణారెడ్డి, కె.సంపత్‌కుమార్‌, సీహెచ్‌ రామచంద్ర రావు, జనరల్‌ మేనేజర్లు సురేంద్రరావు, జగదీష్‌, చక్రపాణి, లత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement