వైభవంగా కదిరప్ప స్వామి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా కదిరప్ప స్వామి రథోత్సవం

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

వైభవంగా కదిరప్ప స్వామి రథోత్సవం

వైభవంగా కదిరప్ప స్వామి రథోత్సవం

గుంతకల్లు రూరల్‌: మండలంలోని వెంకటాంపల్లి కనుమల్లో వెలసిన పెద్ద కదిరప్పస్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. భారీగా భక్తులు తరలి రావడంతో వెంకటాంపల్లి కొండప్రాంతం కిటకిటలాడింది. ఆదివారం వేకువజామునే లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ఉదయం పది గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 51 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ మూర్తులను రథంపై కొలువుదీర్చి గోవింద నామస్మరణతో లాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement