బాలికను గర్భిణి చేసిన కామాంధుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బాలికను గర్భిణి చేసిన కామాంధుడి అరెస్టు

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

బాలికను గర్భిణి చేసిన  కామాంధుడి అరెస్టు

బాలికను గర్భిణి చేసిన కామాంధుడి అరెస్టు

కదిరి టౌన్‌: బాలికను గర్భిణిని చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కదిరి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో సీఐ నాగేంద్ర వివరాలు వెల్లడించారు. వివరాలు.. ఎన్‌పీ కుంట మండలంలోని ఓ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. బాలికపై కన్నేసిన కుంచెపు మహేంద్ర ఆమైపె పలుమార్లు లైంగిక దాడి చేయడంతో గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే బాధితురాలిని నిందితుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఒక ప్రయివేట్‌ నర్సింగ్‌ హోమ్‌కు తీసుకెళ్లి ఇంజెక్షన్‌ వేయించగా, అదే రోజు గర్భస్రావం జరిగింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం గాండ్లపెంట మండలం రెక్కమాను సమీపంలోని కురుమామిడి ఆర్డీటీ ఆస్పత్రి ఎదుట మహేంద్రను అరెస్టు చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్‌, రూ. 500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. నిందితుడిని కదిరి కోర్టులో ఎదుట హాజరుపరచగా జడ్జి రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు క్రిష్ణమూర్తి, సుమతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement