అండర్‌ –14 రాష్ట్ర జట్టుకు రోహిత్‌ | - | Sakshi
Sakshi News home page

అండర్‌ –14 రాష్ట్ర జట్టుకు రోహిత్‌

Feb 6 2026 7:34 AM | Updated on Feb 6 2026 12:12 PM

కే రోహిత్‌

కే రోహిత్‌

అనంతపురం కార్పొరేషన్‌: అండర్‌ –14 రాష్ట్ర క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఎస్‌ మహ్మద్‌ షోయబ్‌, జట్టులో సభ్యుడిగా కే రోహిత్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్‌ సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు చైన్నెలో జరగనున్న అంతర్‌ రాష్ట్ర క్రికెట్‌ పోటీల్లో రోహిత్‌ ఆంధ్ర జట్టు సభ్యుడిగా బరిలో దిగనున్నాడు. 

లెఫ్టార్మ్‌ చైనమన్‌ (హిందూపురం) బౌలర్‌గా స్టేట్‌ ప్రాబబుల్స్‌ మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసుకున్నాడు. హిందూపురం ఎంజీఎం స్కూల్‌లో రోహిత్‌ విద్యనభ్యసిస్తున్నాడు. ఫీల్డింగ్‌ కోచ్‌ షోయబ్‌ ఏసీఏ లెవెల్‌ 0 క్రికెట్‌ కోచ్‌. గుంతకల్లు రైల్వే సబ్‌ సెంటర్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం హర్షించదగ్గ విషయమని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి యుగంధర్‌రెడ్డి పేర్కొన్నారు.

జాతీయ రహదారిపై లారీ దగ్ధం 

కనగానపల్లి: 44వ నంబర్‌ జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక లారీ టైర్‌ పేలడంతో మంటలు వ్యాపించి రోడ్డుపైనే లారీ దగ్ధమైంది. పోలీసుల వివరాల మేరకు... గురువారం తెల్లవారుజామున తమిళనాడుకు చెందిన లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఖాళీ అట్ట పెట్టెల వేసుకొని వెళ్తోంది. పర్వతదేవరపల్లి వద్దకు రాగానే లారీ ముందు టైరు పేలింది. మంటలు వ్యాపించడంతో అట్ట పెట్టెలు అంటున్నాయి. లారీడ్రైవర్లు రాజేంద్రన్‌, వెంకట్‌ లారీ ఆపేసి కిందకు దిగారు. లారీ అంతా కాలిపోయింది. ఘటనతో జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాసేపటి తర్వాత పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

ఫీల్డింగ్‌ కోచ్‌గా షోయబ్‌1
1/1

ఫీల్డింగ్‌ కోచ్‌గా షోయబ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement