సీమ ప్రాజెక్టులకురూ.8 వేల కోట్లు కేటాయించాలి
● రాయలసీమ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్
పెనుకొండ: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 2026–27 బడ్జెట్‌లో కనీసం రూ.8 వేల కోట్ల మేర నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రాయలసీమ విద్యావంతుల వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకనట విడుదల చేశారు. వ్యవసాయంపై ఆధారపడిన రాయలసీమ ప్రాంతం సుదీర్ఘ కాలంగా ఎంతో వెనుకబడి ఉందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు నాలుగు దశాబ్దాల క్రితం ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా అనే నాలుగు ప్రాజెక్టులను చేపట్టారన్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం సీమలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తీ చేయడానికి ఆధునీకరణకు రూ.60 కోట్లు అవసరముందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2024 వరకు రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేసింది రూ.15,078 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో రానున్న బడ్జెట్‌లో కనీసం రూ.8 వేల కోట్లు నిధులు కేటాయించాలన్నారు. అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో చెరువుల పునరుద్దరణ, వాగులు, వంకలను కాలువలతో అనుసంధానించడం, పర్యావరణ పరిరక్షణ, పెన్నానది పునరుజ్జీవనం చేయడం, నీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.
రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్
కదిరి టౌన్: తరచూ నేరాలకు పాల్పడుతూ శాంతి భధ్రతలకు విఘాతం కలిగిస్తున్న కదిరిలోని పూల బజారుకు చెందిన రౌడీ షీటర్ బాలమురళీకృష్ణ అలియాస్ బాలుపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం కదిరి పట్టణ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. తరచూ నేరాలు, ఘర్షణలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న బాలుపై ఇప్పటికే పట్టణ పీఎస్‌లో 7 కేసులు నమోదయ్యాయన్నారు. 2024, ఏప్రిల్‌లో కదిరి తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి, ఏడాది కాలానికి గాను బైండోవర్ చేశామన్నారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కలెక్టర్ ఆదేశాలతో పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
సీమ ప్రాజెక్టులకురూ.8 వేల కోట్లు కేటాయించాలి
సీమ ప్రాజెక్టులకురూ.8 వేల కోట్లు కేటాయించాలి


