మట్టిదొంగలు.. ‘పచ్చ’ నేతలు | - | Sakshi
Sakshi News home page

మట్టిదొంగలు.. ‘పచ్చ’ నేతలు

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

మట్టిదొంగలు.. ‘పచ్చ’ నేతలు

మట్టిదొంగలు.. ‘పచ్చ’ నేతలు

పరిగి: రాష్ట్రం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ నేతలు బరితెగించారు. సంపాదన పరమావధిగా సహజ వనరులను దోచుకు తింటున్నారు. చివరకు మట్టినీ వదలడం లేదు. బుధవారం మండలంలోని శ్రీరంగరాజుపల్లి వద్ద చెరువు సమీపంలో కొందరు టీడీపీ నాయకులు అక్రమంగా మట్టిని తవ్వుతుండగా.. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రంగడుయాదవ్‌ సిబ్బందితో కలిసి వెళ్లారు. పోలీసులను చూడగానే అక్కడున్న వారు వాహనాలు వదిలి పరారయ్యారు. దీంతో టీడీపీ నాయకులు నేతులపల్లి లోకేష్‌, శ్రీరంగరాజుపల్లికి చెందిన హనుమంతరాయప్పకు చెందిన రెండు జేసీబీ వాహనాలతో పాటూ మరో ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనాలను కోర్టుకు సమర్పిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

పోలీసుల దాడితో పరారీ..

వాహనాలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement