ప్రకృతి వ్యవసాయం సూపర్
బత్తలపల్లి: ప్రకృతి సాగు విధానం చాలా బాగుందని ఫ్రాన్స్ దేశస్తులు కితాబిచ్చారు. శనివారం బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామంలో ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్‌మెంట్ నుంచి ఫ్రాన్స్‌కు చెందిన సీనియర్ ఎకానమిస్ట్ డాక్టర్ బ్రునో డోరియన్, పీహెచ్‌డీ పరిశోధకురాలు మిస్ క్యారీ లేపాల్ట్‌లు సర్వే నిర్వహించారు. సీఆర్పీలతో ఏటీఎం మోడల్, ఏ–గ్రేడ్ మోడల్, సీఎండీఎస్ మోడల్స్ చూశారు. చాంపి యన్ రైతులు, నూతనంగా ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులు, రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అంతకు ముందు ఫ్రాన్స్ దేశస్తులను గ్రామస్తులు ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండిపై ఊరేగించారు. గురజాల అప్పస్వామి దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మానాయక్, సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ నవీన్, మాస్టర్ ట్రైనర్ హరికుమార్, డివిజన్ ఇన్‌చార్జ్ గంగమ్మ, ఎల్1 నరసింహులు, ఎల్2 పార్వతి, ఎన్‌ఎఫ్‌ఐలు, ఎల్3లు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ్రాన్స్ దేశస్తుల కితాబు
ప్రకృతి వ్యవసాయం సూపర్


