సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ధర్మవరం అర్బన్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం సాయంత్రం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎస్పీ హేమంత్‌కుమార్, సీఐ నాగేంద్రప్రసాద్‌లకు సూచించారు. సైబర్ క్రైమ్, వివిధ రకాల చట్టాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నైట్ బీట్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్, ఆలయ పరిసరాలు, రైల్వేస్టేషన్లలో తరచూ తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులను విచారించి స్టేషన్‌కు తరలించాలన్నారు. చైన్ స్నాచర్ల బారిన పడకుండా తెల్లవారుజామున వాకింగ్ వెళ్లే వారికి తగిన సూచనలు, జాగ్రత్తలు తెలపాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.


