మెళకువలు పాటించాలి
పిందె పరిమాణం నుంచి అభివృద్ధి సమయంలో మెలకువలు పాటించాలి. పదిహేనేళ్లకు పైన ఉన్న చెట్లపై 500 గ్రాముల యూరియాతో పాటు 1–15 కిలోల పొటాషియం చొప్పున వేస్తే పిందె అభివృద్ధి చెంది వాతావరణ మార్పులను తట్టుకుంటుంది. ఇరవై ఏళ్లు దాటిన తోటల్లో నీటి సౌకర్యం లేనప్పుడు పిందె పరిమాణం బాగా పెరిగిన అనంతరం లీటరు నీటికి 100 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ కలిపి 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే మేలు.
– డాక్టర్ ఈ చండ్రాయుడు, కేవీకే కో ఆర్డినేటర్


