రెండుసార్లు మాత్రమే ఇచ్చారు
చంద్రబాబు ప్రభుత్వం దీపం–2 పథకం అమలు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఐదు సిలిండర్లు కొన్నాను. కేవలం రెండుసార్లు మాత్రమే డబ్బులు ఇచ్చారు. మిగతా మూడుసార్లు నగదు జమ చేయలేదు. నిబంధనలు మార్చారని నిర్వాహకులు చెబుతున్నారు. మొదట్లో ఉన్న అర్హత నెలల వ్యవధిలో ఎలా కోల్పోతామో అధికారులే చెప్పాలి.
– సింధ్య, చౌళూరు, హిందూపురం మండలం
నెలల తరబడి వేచి చూడాలా?
గతేడాది ఏప్రిల్‌లో సిలిండర్ బుక్ చేస్తే 40 రోజుల తర్వాత నగదు ఖాతాలో జమ చేశారు. ఆ తర్వాత గత నవంబరులో ఓసారి బుక్ చేస్తే ఈ ఏడాది మొదట్లో జమ చేశారు. అయితే ఇప్పటి వరకు ఐదుసార్లు బుక్ చేయగా.. కేవలం రెండుసార్లు మాత్రమే సబ్సిడీ నగదు జమ అయింది. అది కూడా నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి.
– చంద్రకళ, కోనాపురం, పెనుకొండ మండలం
రెండుసార్లు మాత్రమే ఇచ్చారు


