శనీశ్వరుని సన్నిధిలో కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

శనీశ్వరుని సన్నిధిలో కలెక్టర్‌

Feb 10 2026 8:08 AM | Updated on Feb 10 2026 8:08 AM

శనీశ్

శనీశ్వరుని సన్నిధిలో కలెక్టర్‌

పావగడ: స్థానిక శనీశ్వరాలయాన్ని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ సోమవారం సందర్శించారు. సర్వ సేవా పూజలు, ప్రాకారోత్సవ పూజల్లో పాల్గొన్నారు. అలాగే శీతలాంభదేవికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంట తల్లి, పినతల్లి ఉన్నారు. కలెక్టర్‌ను ఆలయ సమితి మాజీ అధ్యక్షుడు కేవీ శ్రీనివాస్‌ శాలువా కప్పి సన్మానించారు.

అసంక్రమిత వ్యాధులపై

అప్రమత్తంగా ఉండండి

జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి

డాక్టర్‌ సురేష్‌బాబు

నల్లమాడ: అసంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వయోజనులకు జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ కె.సురేష్‌బాబు సూచించారు. నల్లమాడ మండలం పెమనకుంటపల్లి తండాలో సోమవారం నిర్వహించిన సంచార వైద్య సేవలను ఆయన పరిశీలించి, మాట్లాడారు. అసంక్రమిత వ్యాధులపై స్థానికులకు అవగాహన కల్పించారు. గర్భిణులకు సకాలంలో టీకాలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎపిడమాలజిస్ట్‌ బాలాజీనాయక్‌, సీహెచ్‌ఓ వన్నప్ప, రెడ్డిపల్లి పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్లోటిలో చిరుత సంచారం

మడకశిర రూరల్‌: మండలంలోని ఎల్లోటి గ్రామ శివారు ప్రాంతాల్లో వారం రోజులుగా చిరుత సంచరిస్తోంది. చిరుతను గమనించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం సమయంలో పొలాల వద్దకు వెళ్లలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇటీవల చిరుత దాడిలో జింక, గేదె మృతిచెందాయని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సైతం చిరుత జాడను పసిగట్టే ప్రయత్నం చేపట్టారు.

తెగిపడిన 11 కేవీ విద్యుత్‌ తీగ

రొళ్ల: మండలంలోని ఎం.రాయాపురంలో ఓ ఇంటి పక్కనే ఉన్న స్తంభం నుంచి సోమవారం ఉదయం 11 కేవీ విద్యుత్‌ తీగ ఉన్నఫళంగా తెగిపడింది. ఆ సమయంలో జన సందోహం, జీవాలు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైతుల వ్యవసాయ బోరుబావులకు ఎం.రాయాపురంతో పాటు అగళి మండలం హళ్లికెర గ్రామానికి బీజీ హళ్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుంచి 11 కేవీ విద్యుత్‌ తీగలు లాగారు. అయితే కొత్తగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసిన అధికారులు 30 ఏళ్లుగా పైబడిన విద్యుత్‌ తీగలు లాగడంతో నాణ్యత లేక అవి కాస్త ఎక్కడిక్కడ తెగిపోతున్నాయని రైతులు ఆరోపించారు.

శనీశ్వరుని సన్నిధిలో కలెక్టర్‌ 1
1/2

శనీశ్వరుని సన్నిధిలో కలెక్టర్‌

శనీశ్వరుని సన్నిధిలో కలెక్టర్‌ 2
2/2

శనీశ్వరుని సన్నిధిలో కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement