హామీలు నెరవేర్చకపోతే ప్రతిఘటన తప్పదు | - | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చకపోతే ప్రతిఘటన తప్పదు

Feb 13 2026 5:27 AM | Updated on Feb 13 2026 5:27 AM

హామీలు నెరవేర్చకపోతే ప్రతిఘటన తప్పదు

హామీలు నెరవేర్చకపోతే ప్రతిఘటన తప్పదు

పుట్టపర్తి టౌన్‌: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి హెచ్చరించారు. యూటీఎఫ్‌ తలపెట్టిన రణభేరి 2.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం చేపట్టిన ప్రచారజాతను కలెక్టరేట్‌ ఎదుట ఆయన ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్ర నాయకులు దేవేంద్రమ్మ, రమణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామకృష్ణనాయక్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాబోవు అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ బిల్లు, నూతన పీఆర్సీ నియాకంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 29 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. డీఎస్సీ 2023 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో తలపెట్టిన రణభేరి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు భూతన్న, ఉపాధ్యక్షుడు బాబు, కోశాఽధికారి లక్ష్మీనారాయణ, సీనియర్‌ నాయకులు సుధాకర్‌, నారాయణస్వామి, నరసింహప్ప, సురేష్‌ కుమార్‌, అమరనారాయణరెడ్డి, మురళి, చెన్నకేశవులు, బాబు, సునీల్‌కుమార్‌, అజాం బాషా తదితరులు పాల్గొన్నారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement