ఎల్‌పీఎం సమస్యలను పరిష్కరిస్తాం
నల్లచెరువు: మండలంలో రీ సర్వే పూర్తయిన పంతులచెరువు, తవళంమర్రి గ్రామాల్లో జాయింట్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. జాయింట్ ఎల్‌పీఎంలు ఉన్న రైతులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎల్‌పీఎంలను విభజించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే పట్టాదారు పాస్‌బుక్‌లకు సంబంధించి జరుగుతున్న ఈ–కేవైసీ, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలిచారు. కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ రవినాయక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


