అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
ఎన్‌పీకుంట: వైద్య సిబ్బంది తమకు కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వర్తించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ సురేష్‌బాబు సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. అంగన్ వాడీ కేంద్రాలను తరచూ సందర్శించాలన్నారు. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులను గుర్తించి వారు మెరుగైన స్థితికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిల్వ ఉంచిన టీకాలను పరిశీలించారు. ఓపీ, రికార్డులను తనిఖీ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ బాలాజినాయక్, సీహెచ్‌ఓలు, వన్నప్ప, నాగలక్ష్మి, హెల్త్ సూపర్‌వైజర్ మహేశ్వరరెడ్డి, ఆరోగ్యకార్యకర్తలు రమేష్‌రెడ్డి, ఆదినారాయణ, ఫార్మసిస్ట్ ప్రకాష్, ఏఎన్‌ఎమ్‌లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించాలి
గాండ్లపెంట: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందేలా ఆరోగ్యసిబ్బంది పని చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేష్‌బాబు అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. టీకాల రికార్డులు, టీకాలు నిల్వ ఉంచిన గదులను పరిశీలించారు. వైద్యాధికారి మహేశ్వరమారుతి, సామాజిక ఆరోగ్య అధికారి నాగేష్, తదితరులు పాల్గొన్నారు.


