గంజాయి విక్రేతలకు పదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేతలకు పదేళ్ల జైలు

Feb 6 2026 7:34 AM | Updated on Feb 6 2026 7:34 AM

గంజాయ

గంజాయి విక్రేతలకు పదేళ్ల జైలు

అనంతపురం: గంజాయి సరఫరా, విక్రయ ముఠాలోని ఆరుగురు యువకులకు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం జిల్లా మొదటి సెషన్స్‌ కోర్టు జడ్జి సత్యవాణి గురువారం సంచలన తీర్పు వెలువరించారు. 2021 జూన్‌ 17న అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాలు దగ్గర ఎస్‌ఐ నబిరసూల్‌ వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒక కారులో 29 కేజీల గంజాయి దొరింది. వీటిని తరలిస్తున్న అనంతపురానికి చెందిన కుంచపు వడ్డే పవన్‌కుమార్‌, గాజుల అఖిల్‌, ధనరాజ్‌, కళ్యాణదుర్గానికి చెందిన గాజుల నాగరాజు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెంకు చెందిన పూల సునీల్‌ కుమార్‌, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పల్లె వెంకట రవితేజలను అరెస్ట్‌ చేశారు. వీరంతా 21 నుంచి 29 ఏళ్లలోపు వయసు కలిగిన యువకులే. అప్పటి సీఐ మురళీధర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం అనంతపురం మొదటి అడిషనల్‌ జిల్లా సెషన్స్‌ కోర్టులో చార్జ్‌షీటు దాఖలు చేశారు. ఈ కేసులో నలుగురు సాక్షులను జడ్జి సత్యవాణి విచారించారు. నేరం రుజువు కావడంతో అనంతపురం, శ్రీసత్యసాయి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ఆరుగురు ముద్దాయిలకు పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ గురువారం తీర్చు చెప్పారు. స్పెషల్‌ పీపీ లేపాక్షి నాయుడు ప్రాసిక్యూషన్‌ తరఫున వాదించారు.

పర్వతారోహకుడు

ఈశ్వర్‌కు అభినందన

మడకశిర: పట్టణానికి చెందిన పర్వతారోహకుడు, ట్రెక్కింగ్‌లో విశేష ప్రతిభ కనబరస్తున్న ఈశ్వర్‌ను గురువారం పుట్టపర్తిలో కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఘనంగా సన్మానించారు. ఈశ్వర్‌ను మడకశిర నుంచి ప్రత్యేకంగా పిలిపించుకుని కలెక్టర్‌ అభినందించారు. సాహస క్రీడల్లో ఈశ్వర్‌ రాణిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈశ్వర్‌ జిల్లాకే గుర్తింపు తెచ్చారని, ఇది ప్రజలకు ఎంతో గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్‌లో మరెన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారని ఈశ్వర్‌ తెలిపారు. యువతకు సాహస క్రీడలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతానని ఈశ్వర్‌ తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి కిషోర్‌ పాల్గొన్నారు.

గంజాయి విక్రేతలకు పదేళ్ల జైలు 1
1/1

గంజాయి విక్రేతలకు పదేళ్ల జైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement