చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత జరిగిన నేరాలు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత జరిగిన నేరాలు ఇలా..

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

చంద్ర

చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత జరిగిన నేరాలు ఇలా..

హిందూపురం అల్లకల్లోలంగా మారింది. నేరగాళ్లు రెచ్చిపోతుండటంతో సామాన్య జనం బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. వివిధ కేసుల్లో ఉన్న వారు బెయిల్‌పై

బయటకు వచ్చి దర్జాగా సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. ఏకంగా పోలీసులపైనే దాడులకు దిగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

సాక్షి, పుట్టపర్తి: హిందూపురం నియోజకవర్గం క్రిమినల్స్‌కు అడ్డాగా మారింది. అత్యాచారాలు, రాబరీలు, హత్యలు, హత్యాయత్నాలు, గూండాయిజం పెరిగిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించిపోయింది. ఎస్‌పీ సతీష్‌కుమార్‌ జిల్లాకు వచ్చిన తర్వాత నేరాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ హిందూపురం నియోజకవర్గ పరిస్థితి మాత్రం మారలేదు.

నిఘా వైఫల్యమే కారణమా?

అధికార పార్టీ నాయకుల చేతుల్లో పోలీసులు కీలు బొమ్మల్లా మారడంతోనే హిందూపురంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయన్న విమర్శలున్నాయి. దీనికి తోడు పోలీసులు కూడా నిఘా పెట్టడంలో విఫలమయ్యారన్న వాదనలున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి లా అండ్‌ ఆర్డర్‌ను గాడిలో పెట్టడంతో నేరాల తీవ్రత తక్కువగా ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. పోలీసులు... టీడీపీ నేతల ధాటికి తట్టుకోలేకపోవడం, పోలీసుల నిఘా లేదన్న సంకేతాన్ని గుర్తించడం కారణంగా రౌడీమూకలు, దొంగలు రెచ్చిపోతున్నారని అంటున్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యాలయం ధ్వంసం..

గతేడాది నవంబర్‌ 15న టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. హిందూపురం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద వందల మంది టీడీపీ నాయకులు , కార్యకర్తలు చేరుకొని బీభత్సం సృష్టించారు. చైర్లు, భవనం అద్దాలు, కంప్యూటర్లను పగలగొట్టారు. పోలీసుస్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటక నుంచి రౌడీషీటర్లు..

హిందూపురం పట్టణం రాష్ట్ర సరిహద్దులో ఉంది. దీంతో కర్ణాటక రాష్ట్రం సరిహద్దు పట్టణాల్లో ఉండే రౌడీషీటర్లు యథేచ్ఛగా జిల్లాలో సంచరిస్తుండటం కలకలం రేపుతోంది. పోలీసుల నిఘా కొరవడటంతోనే జిల్లాలో సెటిల్‌మెంట్లు , దాడులకు యత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో తరచూ జరుగుతున్న పరిణామాలతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితులున్నాయి. కనీసం ఇప్పటికై నా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉండి లా అండ్‌ ఆర్డర్‌ను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చంద్రబాబు సర్కార్‌ అధికారం చేపట్టిన నెల రోజులకే హిందూపురం రూరల్‌ మండలంలోని గొళ్లాపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ సతీష్‌ను టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు.

2024లోనే చిలమత్తూరు మండలంలోని టేకులోడు పంచాయతీ నల్లబొమ్మనపల్లి సమీపంలో అత్తా కోడళ్లను గ్యాంగ్‌ రేప్‌ చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది.

2025లో దొంగలు యథేచ్చగా రాబరీలకు తెగబడ్డారు. గన్స్‌, కత్తులు చూపించి హిందూపురం రూరల్‌ మండలం కిరికెర సమీపంలో ఓ ఇంట్లో దోపిడీ చేశారు.

అదే సంవత్సరం జూలైలో హిందూపురం రూరల్‌ మండలంలోని తూముకుంట ఎస్‌బీఐ రాబరీ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

లేపాక్షి మండలంలోని మైదుగోళంలో ఓ వ్యక్తి తలను వేరుచేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన పోలీసులతో పాటు సామాన్యులను కూడా బెంబేలెత్తించింది.

చిలమత్తూరు మండలంలో టీడీపీ నేతల దాష్టీకాలకు అంతే లేకుండా పోయింది. గతేడాది ఆగష్టులో ఎంపీపీ పురుషోత్తమరెడ్డిని హతమార్చేందుకు పక్కా స్కెచ్‌ వేసి ఆయనపై దాడి చేయడం, ఆయన తీవ్ర గాయాలతో త్రుటిలో తప్పించుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు బాబూరెడ్డి పై గతంలోనే హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. నిందితుడికి టీడీపీ నేత నాగరాజు యాదవ్‌ అనుకూలంగా ఉండటంతో బాబూరెడ్డిని కనీసం పోలీసులు అరెస్ట్‌ కూడా చేయలేకపోయారు.

హిందూపురం నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో చోరీలు జరిగాయి. హుండీల్లోని డబ్బులను దుండగులు దోచుకెళ్లారు.

అంతకంతకూ పెరిగిపోతున్న నేరాలు

సెటిల్‌మెంట్లు, హత్యలు,

దొంగతనాలతో ప్రజల బెంబేలు

పోలీసులపైనే దాడులకు

తెగబడుతున్న వైనం

ఖాకీలు అధికార పార్టీ చేతుల్లో

కీలుబొమ్మల్లా మారడంతో పరిస్థితులు చేజారిపోతున్నాయంటున్న ప్రజలు

పోలీసులపైనే దాడి..

2024 అక్టోబర్‌లో చిలమత్తూరు మండలం టేకులోడు సమీపంలో జరిగిన అత్తా కోడళ్లపై అత్యాచారంలో ప్రధాన నిందితుడు కావడి నాగేంద్ర శుక్రవారం ఉదయం కానిస్టేబుల్‌ రవిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచడం సంచలనం రేపింది. 70కి పైగా కేసులు ఉన్న నిందితుడు తప్పించుకుని తిరుగుతూ అఘాయిత్యాలు కొనసాగిస్తున్న తరుణంలో పోలీసులు బృందాలుగా విడిపోయి చిలమత్తూరు మండలంలోని ఎర్రకొండ అటవీప్రాంతం కనుమ వద్ద నాగేంద్ర ఉన్నాడన్న సమాచారంతో వెళ్లగా కానిస్టేబుల్‌తో పాటు సీఐ ఆంజనేయులపై నిందితుడు దాడి చేసి గాయపరిచాడు. అయితే సీఐ కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులపైనే దాడి చేసి గాయపరిచిన నిందితుడికి పట్టణంలోని పోలీసు సిబ్బంది నిరంతరాయం సహకరించారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత జరిగిన నేరాలు ఇలా.. 1
1/2

చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత జరిగిన నేరాలు ఇలా..

చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత జరిగిన నేరాలు ఇలా.. 2
2/2

చంద్రబాబు సర్కార్‌ వచ్చిన తర్వాత జరిగిన నేరాలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement