వెంటనే పరిహారం చెల్లించాలి
మామిడి రైతులు చెల్లించిన ప్రీమియానికి వెంటనే పరిహారం చెల్లించాలి. గత ఏడాది మామిడి రైతులు వివిధ కారణాలతో పంటను కోల్పోయారు. ఈ విషయంపై గతంలోనే కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో రైతులు అంతా కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఏడాది గడిచినా పరిహారంపై ఇప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. చిత్తూరు రైతులను ఒకలా, ఇతర జిల్లాల రైతులను ఒకలా చూసే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం సిగ్గుచేటు. తోతాపురి కాయల కొనుగోలులో వ్యత్యాసం చూపి మామిడి రైతులను నట్టేట ముంచారు.
– ఆవుటాల రమణారెడ్డి,
అగ్రిబోర్డు జిల్లా మాజీ అధ్యక్షుడు


