3.6 లక్షలు
గ్యాస్ కోత ఇలా...
చిత్రంలోని మహిళ పేరు రమణమ్మ. నల్లచెరువు మండలం పెద్దయల్లంపల్లి. గ్యాస్ సిలిండర్ కొన్న ప్రతిసారీ డెలివరీ బాయ్‌ను అడిగితే రెండు రోజుల్లో నగదు జమ అవుతుందని చెబుతున్నాడని, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి డబ్బులు పడలేదని వాపోయారు. నిర్వాహకులను అడిగితే అధికారుల వద్దకు వెళ్లాలని చెబుతున్నారని, నిబంధనలు ఏం ఉన్నాయో కూడా చెప్పే వాళ్లు లేరన్నారు.
ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు రమాదేవి. రొద్దం వాసి. దీపం–2 పథకంలో అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సిలిండర్ డబ్బులు కూడా జమ కాలేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే.. వచ్చే నెలలో చూద్దామంటూ మాట దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి మూడు సిలిండర్లు అని చెప్పి.. ఒక్క సిలిండర్ కూడా ఇవ్వకుండా కొర్రీలు పెట్టడం ఏంటని వాపోతున్నారు.
ఈమె పేరు లక్ష్మీనరసమ్మ. పరిగి మండలంలో నివసిస్తుంటారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏడుసార్లు సిలిండర్లు కొనుగోలు చేశారు. అయితే మొదట్లో రెండుసార్లు మాత్రమే గ్యాస్ సిలిండర్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. ఆ తర్వాత జమ కాలేదు. ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే నిబంధనలు మారాయని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షి, పుట్టపర్తి: ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక పథకంలో కొర్రీలు పెడుతూ వినియోగదారుల నెత్తిన భారం మోపారు. షరతులు విధిస్తూ.. ప్రతి ఏటా కోత విధిస్తున్నారు. ఏడాదిలో ఒకసారి సబ్సిడీ పొందిన వారికి.. మరో రెండుసార్లు నగదు జమ కావడం లేదు. మూడు, నాలుగు నెలల లోపు ఏదో షరతు పేరుతో అనర్హుల జాబితాలో పేరు ఉందని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
ఉత్తుత్తి ప్రచారమేనా?
చంద్రబాబు ప్రభుత్వం 2024 నవంబర్‌లో దీపావళి పండుగ సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళలకు ఒక్కో సిలిండర్ అందజేసి ఫొటోలకు ఫోజులిచ్చి.. ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత అదే లబ్ధిదారులకు మరో సిలిండర్ కూడా ఉచితంగా రాకపోవడం గమనార్హం. తొలిసారి సిలిండర్ అందుకున్న వారికి ఇప్పటి వరకు సిలిండర్ డబ్బులు జమ కాలేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను అడిగితే.. నిబంధనలు మార్చారని.. ఇప్పుడు అర్హత కోల్పోయారని సమాధానం చెబుతున్నారు. దీంతో ఉచిత గ్యాస్‌పై ఆధారపడిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విడతల వారీగా కోత
జిల్లా వ్యాప్తంగా 5.61 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో తొలివిడతలో 2024లో 3.6 లక్షల మందికి దీపం–2 పథకం కింద ఉచితంగా సిలిండర్లు అందజేశారు. ఆ తర్వాత రెండో విడతలో లబ్ధిదారుల సంఖ్య 2025లో 3.4 లక్షలకు తెచ్చారు. ప్రస్తుతం దీపం–2 పథకం లబ్ధిదారులు 2026లో 2.95 లక్షలు మాత్రమే ఉన్నారు. ఏడాది వ్యవధిలో వేలాది మంది అర్హత కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముందుగా నగదు చెల్లించి సబ్సిడీ కోసం వేచి చూసి.. నిరాశ చెందుతున్నారు.
ఏడాదిలో ఒక సిలిండర్ ఇచ్చి ఉచిత గ్యాస్ పథకానికి మంగళం
అర్హత ఉన్నప్పటికీ జమ కాని సబ్సిడీ
జిల్లా వ్యాప్తంగా
చాలా మందికి మొండి చెయ్యి
ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తానన్న సీఎం చంద్రబాబు
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్యాస్ కనెక్షన్లు
2024లో గ్యాస్ సబ్సిడీ పొందిన వారు
2.95
5.61
లక్షలు
3.6 లక్షలు
3.6 లక్షలు
3.6 లక్షలు
3.6 లక్షలు
3.6 లక్షలు


