కామంతో కళ్లుమూసుకుని.. | - | Sakshi
Sakshi News home page

కామంతో కళ్లుమూసుకుని..

Feb 2 2026 8:20 AM | Updated on Feb 2 2026 8:20 AM

కామంతో కళ్లుమూసుకుని..

కామంతో కళ్లుమూసుకుని..

ఎన్‌పీకుంట: మానవత్వం మంటకలిసింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ దుర్మార్గుడు కుమార్తైపెనే పలుమార్లు లైంగిక దాడి చేశాడు. తన స్నేహితులనూ ఆమైపె పురిగొలిపి చివరికి గర్భం దాల్చేలా చేశాడు.వివరాలు..ఎన్‌పీకుంట మండలంలోని ఓ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువు తోంది. ఇటీవల విద్యార్థిని తరచూ కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఉపాధ్యాయి నులు గమనించి ఆస్పత్రికి పంపారు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడైంది. బాలికను ఆరా తీస్తే భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి.తండ్రి కారణంగానే ఇలా జరిగినట్లు తెలిసింది. మద్యం మత్తులో తనపై పలుమార్లు లైంగికదాడి చేశాడని ఆమె వాపోయింది. ఒకసారి తన స్నేహితులను వెంటబెట్టుకుని వచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. సదరు కామాంధుడిపై గతంలో పలు పోలీసు కేసులున్నట్లు తెలిసింది.

కుమార్తైపె పలుమార్లు తండ్రి అఘాయిత్యం

గర్భం దాల్చిన బాలిక

ఎన్‌పీ కుంట మండలంలో దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement