ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మహాసభ రేపు | - | Sakshi
Sakshi News home page

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మహాసభ రేపు

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మహాసభ రేపు

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మహాసభ రేపు

అనంతపురం అగ్రికల్చర్‌: ఉమ్మడి జిల్లా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మహాజనసభ ఈ నెల 8న (ఆదివారం) ఉదయం 9 గంటలకు అనంతపురంలోని డీఎంహెచ్‌ఓ కమిటీ హాలులో నిర్వహించనున్నట్లు ఏపీ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ నాయకులు సి.వరప్రసాద్‌, రాఘవేంద్ర, శివానంద, సిద్ధయ్య, సాకే చంద్ర, రామకృష్ణ, కిరణ్‌యాదవ్‌, బి.మహేంద్ర తెలిపారు. ఇందుకు సంబంధించి పోస్టర్లను శుక్రవారం అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల (జీఎంసీ) వారు విడుదల చేసి, మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సంస్థాగతంగా సంఘం బలోపేతం లక్ష్యంగా మహాజనసభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రతి నెలా రెండో శనివారం ‘హలో ఔట్‌సోర్సింగ్‌ ఏపీ’ పేరుతో గ్రీవెన్స్‌ నిర్వహిస్తూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర నాయకులు, జేఏసీ నేతలు హాజరుకానున్న మహాజనసభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement