రైతులను ఆదుకోవాలి
●
శనగలకు చంద్రబాబు సర్కార్ ‘మద్దతు’ ఇవ్వలేదు. అందుకే అగ్రి మిషన్ మాజీ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్లమెంట్ సభ్యులు అవినాష్‌రెడ్డి, గురుమూర్తి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపాం. శనగలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోరాదని, రాష్ట్రంలో పండించిన శనగలకు రూ.1000 బోనస్ ప్రకటించాలని కోరాం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా... అందులో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు రైతులకు న్యాయం చేయాలని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది సిగ్గుచేటు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం రాష్ట్ర ప్రజలు చేసిన పెద్ద తప్పిదం.
– ఆవుటాల రమణారెడ్డి, మాజీ చైర్మన్,
అగ్రి అడ్వయిజరీ బోర్డు


