రైతులు ఫిర్యాదు చేస్తే లైసెన్స్‌ రద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులు ఫిర్యాదు చేస్తే లైసెన్స్‌ రద్దు

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

రైతుల

రైతులు ఫిర్యాదు చేస్తే లైసెన్స్‌ రద్దు

వ్యవసాయశాఖ జేడీ కృష్ణయ్య

ఓడీచెరువు: ఎరువులు, పురుగు మందులు అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై రైతులు ఫిర్యాదు చేస్తే ఫర్టిలైజర్‌ షాపుల లైసెన్స్‌ రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి కృష్ణయ్య హెచ్చరించారు. మండల కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర, బాలాజీ ఫర్టిలైజర్‌ షాపులను శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని ఎరువులు, పురుగు మందుల రికార్డులు, నిల్వలను పరిశీలించారు. ఎరువుల నిల్వలు, ధరల పట్టిక కచ్చితంగా బోర్డులో ఉంచాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ ఏడీఏ సనావుల్లా, కదిరి ఏఓ శ్రీహరినాయక్‌ పాల్గొన్నారు.

నేడు 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు పరీక్ష

లేపాక్షి: లేపాక్షి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందూపురం పట్టణంలో అజిజీయ, ఎంజీఎం, ముద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అలాగే ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఏర్పడిన ఖాళీలకు 1205 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి లేపాక్షిలోని జవహర్‌ నవోదయ విద్యాలయం, ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు అడ్మిట్‌ కార్డులతో ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రశాంతినిలయం: తనకల్లు మండలంలో ఉన్న ఏపీ గిరిజన సంక్షేమ పాఠశాలలో ఖాళీ సీట్లకి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఒక ప్రకటనలో కోరారు. 2026–27 సంవత్సరానికి 5వ తరగతిలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 80 సీట్లు ఉన్నాయని, అందులో ఎస్టీ 60, ఎస్సీ 10, బీసీ 4, ఓసీ 2, పీహెచ్‌సీలకు 2, ఏఈక్యూ 2 సీట్లు ఉన్నాయన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఈనెల 28 వరకూ ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 4న రాత పరీక్ష ఉంటుందన్నారు. వివరాలకు ప్రిన్సిపాల్‌ ఫోన్‌ నంబర్‌ 8500941752, 8333807978ను సంప్రదించాలన్నారు.

ఇంటర్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోండి

ప్రశాంతినిలయం: తనకల్లు మండలంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు అర్హులైన విద్యార్థులు(బాలికలు) దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఒక ప్రకటనలో కోరారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గిరిజన బాలికలు ఈనెల 9 నుంచి మార్చి 4వ తేదీ లోపు దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు. ప్రవేశ పరీక్ష మార్చి 8న ఉదయం 11 గంటలకు ఉంటుందన్నారు.

11న పాలిటెక్నిక్‌

కళాశాలలో జాబ్‌మేళా

ధర్మవరం అర్బన్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఈనెల 11న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సురేష్‌బాబు తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారు అర్హులన్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.23 వేల వరకు జీతం ఉంటుందన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న వారు హైదరాబాద్‌, బెంగళూరు, కడప, పెనుకొండ, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. సర్టిఫికెట్లతో ఆ రోజు ఉదయం 9 గంటలకు పాలిటెక్నిక్‌ కళాశాలలో జరిగే జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు.

రైతులు ఫిర్యాదు చేస్తే  లైసెన్స్‌ రద్దు 1
1/1

రైతులు ఫిర్యాదు చేస్తే లైసెన్స్‌ రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement