వర్షాలు కురవాలి
వేసవి ప్రారంభానికి ముందే కొన్ని బోర్లలో నీటి లభ్యత తగ్గిపోయింది. ఈ ఏడాది వర్షాలు ముందుగానే కురిస్తేనే మేలు జరుగుతుంది. లేకపోతే చాలా బోర్లు ఎండి రైతులు పంటలను పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇటీవల పలువురు రైతులు కొత్తగా రూ.లక్షలు ఖర్చు పెట్టి బోర్లు తవ్విస్తున్నారు. అప్పులభారం మోస్తున్నారు. –రవికుమార్, బీజీహళ్లి, రొళ్ల మండలం
ఆందోళన కలిగిస్తోంది
బోర్లపైనే ఆధారపడి 5 వేల వక్క చెట్లు సాగు చేశా. బోర్లలో నీటి లభ్యత తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. వేసవిలో బోర్ల మనుగడ మరింత కష్టంగా ఉంటుంది. ప్రతి ఏడాది కృష్ణా జలాలతో చెరువులను నింపితే బోర్లలో నీరు పుష్కలంగా వస్తాయి. లేకపోతే రైతులకు కష్టాలు తప్పవు.
–చంద్రప్ప, మధూడి, అగళి మండలం
వర్షాలు కురవాలి


