విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

పుట్టపర్తిటౌన్‌: విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని ఎస్పీ సతీష్‌కుమార్‌, ఆర్డీఓ సువర్ణ సూచించారు. బుధవారం కొత్తచెరువు శ్రీ చైతన్య పాఠశాల మైదానంలో పాఠశాలల అధినేత డాక్టర్‌ బీఎస్‌రావ్‌ జ్ఞాపకార్థం జోనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ సతీష్‌కుమార్‌, ఆర్డీఓ సువర్ణతోపాటు ఏజీఎమ్‌ సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పట్టుదల అలవాటవుతాయన్నారు. విద్యార్థులకు ప్రత్యేకమైన లక్ష్యం ఉండాలన్నారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా, బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకొని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని చైతన్య బ్రాంచ్‌ల నుంచి దాదాపు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాళ్లు, కోఆర్డినేటర్లు, డీన్లు, ఏఓలు, పీఈటీలు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement