ఆగని గుప్త నిధుల తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

ఆగని గుప్త నిధుల తవ్వకాలు

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

ఆగని

ఆగని గుప్త నిధుల తవ్వకాలు

పెనుకొండ: చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పెనుకొండ పరిధిలో గుప్త నిధుల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దుండగులు రాత్రికి రాత్రే తవ్వకాలు చేస్తూ పురాతన భవనాలు, ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు.

పెనుకొండ కేంద్రంగా పాలన..

విజయనగర రాజులు, జైన రాజులు, చోళులు ఇతర ఎంతో మంది రాజులు పెనుకొండను కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశారు. పెనుకొండ ఊరువాకలి ఆంజనేయస్వామి, ఆర్డీఓ కార్యాలయం తదితర ప్రాంతాల్లో అప్పట్లో రాజులు ప్రధాన కేంద్రంగా చేసుకుని పాలన సాగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు దాచారన్న ప్రచారం ఉంది. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన అనేక మంది ముఠాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో గుప్త నిధుల కోసం అన్వేషణ చేస్తున్నారు. పెనుకొండ పరిసరాల్లోని గగన్‌మహల్‌, కోటగోడ, రాంబురుజులు, తిమ్మరుసు బందీఖానా, తిమ్మరుసు సమాధి, బసవణ్ణ బావి, నాగుల బావి, కొండపై ఖిల్లా, లక్ష్మీనరసింహస్వామి ఆలయం వీరణ్ణ కొండపై ఉన్న కట్టడాలు, ఇటీవల వెలుగు చూసిన వైష్ణవ ఆలయం ఇతర ఎన్నో కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే పెనుకొండ కొండ సొరంగం, గగన్‌మహల్‌ నుంచి ఉన్న రహస్య మార్గాల ద్వారా రొద్దం మండలం బొక్కసంపల్లి వద్ద సైతం గతంలో రాజులు ముస్లిం చక్రవర్తుల కంట పడకూడదని ఏనుగుల ద్వారా బంగారు, వజ్రాలు ఇతర సామగ్రిని తరలించారని ప్రచారంలో ఉంది. దీంతో గుప్త నిధుల వేటగాళ్లు నిరవధికంగా ఇక్కడ తవ్వకాలు సాగిస్తున్నారు.

పెరిగిన పర్యాటకులు..

పెనుకొండకు ఇటీవల బెంగళూరు, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు క్యూ కడుతున్నారు. సెలవులు వస్తే చాలు వాహనాలతో కొండపైకి రావడం అలవాటుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో వీరణ్ణ కొండ వెనుక ప్రాంతంలో ఉన్న వైష్ణవ ఆలయాన్ని గుర్తించిన అధికారులు ఆలయం ఆవరణలో ఇష్టారాజ్యంగా నిధుల కోసం తవ్విన ఆనవాళ్లు గుర్తించారు. పెనుకొండ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా ఇలాంటి ఘటనలపై పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పెనుకొండలో

పురాతన కట్టడాల ధ్వంసం

పట్టించుకోని అధికారులు, పోలీసులు

కట్టడాల పరిరక్షణకు చర్యలు

గుప్త నిధుల వేటగాళ్లతో పురాతన కట్టడాలు దెబ్బతింటున్న విషయం వాస్తవమే. స్థానిక పోలీసులకు తెలియజేసి తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకుంటాం. అదే విధంగా విషయాన్ని పురావస్తు శాఖ డీడీ, కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. పురాతన కట్టడాల పరిరక్షణకు తగిన సిబ్బందిని నియమించి కట్టడాలను పరిరక్షిస్తాం.

– స్వామినాయక్‌, పురావస్తుశాఖ అధికారి

ఆగని గుప్త నిధుల తవ్వకాలు 1
1/2

ఆగని గుప్త నిధుల తవ్వకాలు

ఆగని గుప్త నిధుల తవ్వకాలు 2
2/2

ఆగని గుప్త నిధుల తవ్వకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement