కంటైనర్‌లో మంటలు | - | Sakshi
Sakshi News home page

కంటైనర్‌లో మంటలు

Feb 2 2026 8:20 AM | Updated on Feb 2 2026 8:20 AM

కంటైనర్‌లో మంటలు

కంటైనర్‌లో మంటలు

చెన్నేకొత్తపల్లి: ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా కంటైనర్‌ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాలు.. తమిళనాడులోని హోసూరు నుంచి మహారాష్ట్రలోని లాథూర్‌కు ప్లాస్టిక్‌ క్రేట్‌ల లోడుతో బయలుదేరిన కంటైనర్‌ ఆదివారం సీకేపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌ జ్ఞానేంద్రయాదవ్‌ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేశాడు. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పెనుకొండ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేసేలోపు క్యాబిన్‌ మొత్తం కాలిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement