మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

మహిళ దుర్మరణం

Feb 7 2026 3:00 PM | Updated on Feb 7 2026 3:00 PM

మహిళ

మహిళ దుర్మరణం

పెనుకొండ రూరల్‌: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు.. పెనుకొండ రూరల్‌ పరిధిలోని అమ్మవారిపల్లికి చెందిన ఉప్పర రామాంజినమ్మ (54).. కియా పోలీస్‌ స్టేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం సాయంత్రం వ్యక్తిగత పనిపై కియా పరిశ్రమ మెయిన్‌ గేట్‌ వద్దకు వెళ్లిన ఆమె అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమై రోడ్డు దాటుతుండగా బెంగళూరు వైపుగా వెళుతున్న వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ వాహనంతో సహా ఉడాయించాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

అక్కంపల్లిలో దొంగ హల్‌చల్‌

మడకశిర: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని అక్కంపల్లిలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఓ దొంగ హల్‌చల్‌ చేశాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వీటిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రముఖ కాంట్రాక్టర్‌ బాబు ఇంట్లోకి చొరబడేందుకు దొంగ ప్రయత్నించాడు. అయితే ఇంటి గేట్‌ వద్ద ఉన్న కుక్క పసిగట్టి అరవడంతో అక్కడి నుంచి జారుకున్న దొంగ పక్కనే ఉన్న మరో ఇంటి ఆవరణలో ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ను అపహరించుకెళ్లాడు.

శెట్టిపల్లి వద్ద కంటైనర్‌ బోల్తా

చిలమత్తూరు: మండలంలోని కోడూరు – పుట్టపర్తి ప్రధాన రహదారిపై శెట్టిపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్‌ వాహనం బోల్తా పడింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు ఆరా తీశారు.

మహిళ దుర్మరణం 
1
1/2

మహిళ దుర్మరణం

మహిళ దుర్మరణం 
2
2/2

మహిళ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement