సీమ ద్రోహి చంద్రబాబు
రాయలసీమలో పుట్టిన చంద్రబాబు...సీమ ద్రోహిగా మారారు. రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలన్న సంకల్పంతోనే వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తే.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చేతులు కలిపిన చంద్రబాబు దాన్ని నిలిపివేశారు. దీనివల్ల వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. ఆయన్ను ఈ ప్రాంత రైతులు ఎప్పటికీ క్షమించరు. చందబ్రాబు వైఫల్యం..రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకే వైఎస్సార్ సీపీ ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమం నిర్వహిస్తోంది. రైతులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలి.
– ఉషశ్రీ చరణ్,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు


