స్పెల్‌బీలో జిల్లా విద్యార్థి సత్తా | - | Sakshi
Sakshi News home page

స్పెల్‌బీలో జిల్లా విద్యార్థి సత్తా

Feb 1 2026 3:04 AM | Updated on Feb 1 2026 3:04 AM

స్పెల్‌బీలో జిల్లా విద్యార్థి సత్తా

స్పెల్‌బీలో జిల్లా విద్యార్థి సత్తా

ప్రశాంతినిలయం: రాష్ట్ర స్థాయిలో జరిగిన స్పెల్‌బీ పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థి సత్తా చాటి రెండో స్థానంలో నిలిచాడని డీఈఓ కృష్ణప్ప, జిల్లా పరీక్షల మండలి సెక్రటరీ గోపాల్‌, జిల్లా సైన్స్‌ అధికారి తనూజ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం విజయవాడలోని స్టెల్లా కళాశాలలో ఎస్‌సీఈఆర్టీ, విభా ఆధ్వర్యంలో స్పెల్‌బీ పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా,పదో తరగతి విభాగంలో కొత్తచెరువు బాలుర పాఠశాలకు చెందిన జశ్వంత్‌ కుమార్‌రెడ్డి రాత పరీక్ష, ఓరల్‌ రౌండ్‌లో ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచినట్లు వివరించారు. విజేతలకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ వెంకటక్రిష్ణారెడ్డి జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.

యువతకు ఉద్యోగ అవకాశాలు

పుట్టపర్తి టౌన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సీడాప్‌ జాబ్‌ కోఆర్డినేటర్‌ ఆంజనేయులు తెలిపారు. పది, ఇంటర్‌,డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసి 19–26 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులన్నారు. స్పోకెన్‌ ఇంగ్లిష్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, ఇంటర్‌నెట్‌ స్కిల్స్‌పై 90 రోజుల పాటు అనంతపురంలో శిక్షణ ఇస్తామన్నారు. వివరాలకు 9676042701, 8074495608 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement