‘పచ్చ’ కబ్జాకు చెక్
● ఆలయం పేరుతో స్థలానికి
ఎసరుపెట్టిన వారికి హెచ్చరిక
● ఈ స్థలం తహసీల్దార్ ఆఫీసుకు కేటాయించినట్లు బోర్డు
పుట్టపర్తి: బుక్కపట్నం సచివాలయం–3 వద్ద బుక్కపట్నం–ముదిగుబ్బ మార్గంలో జాతీయ రహదారి– 342కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 1533లోని 80 సెంట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించిన తెలుగు తమ్ముళ్లకు అధికారులు చెక్ పెట్టారు. రూ.3.20 కోట్ల విలువైన 80 సెంట్ల స్థలాన్ని చేజిక్కించుకోవాలని టీడీపీ నాయకులు గంగమ్మ ఆలయం పేరుతో చేస్తున్న కుయుక్తులను వివరిస్తూ ‘‘ఆలయం పేరుతో పచ్చ పన్నాగం’’ శీర్షికన గురువారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన బుక్కపట్నం తహసీల్దార్ నరసింహులు శుక్రవారం సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. స్థానికుల ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం ‘‘ఈ స్థలం తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించారు..ఆక్రమణదారులు శిక్షార్హులు’’ అంటూ హెచ్చరిక బోర్డు నాటించారు. తహసీల్దార్ వెంట వీఆర్‌ఓలు రామమోహన్, నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
21 నుంచి
‘అనంత బాలోత్సవం’
అనంతపురం ఎడ్యుకేషన్: చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో నిర్వహించనున్న ‘అనంత బాలోత్సవం–6’ను జయప్రదం చేయాలని అనంతపురం డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
‘పచ్చ’ కబ్జాకు చెక్


