వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
పుట్టపర్తి టౌన్: జిల్లాకు చెందిన ఇద్దరికి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లోని కమిటీల్లో చోటు కల్పించారు. అలాగే మరో పది మందిని జిల్లా కమిటీల్లో నియమించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మవరానికి చెందిన షేక్ బాషా, పుట్టపర్తికి చెందిన ఎం. మాబూసాబ్‌ను మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అలాగే జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డి (ధర్మవరం), ప్రధాన కార్యదర్శిగా కోటి నరేష్ (ధర్మవరం), కార్యదర్శులుగా రాజశేఖర్‌రెడ్డి(ధర్మవరం), కె.రాజుకుళ్లాయప్ప (ధర్మవరం), కార్యనిర్వాహక సభ్యులుగా డి.యుగంధర్(ధర్మవరం), డి.శ్యామ్ కుమార్ (ధర్మవరం)ను నియమించారు. ఇక జిల్లా మైనారిటీ సెల్ కార్యనిర్వాహక సభ్యులుగా ఎస్.చాంద్‌బాషా (హిందూపురం) ఎఫ్. ఇర్షాద్ (హిందూపురం), హెచ్.ఆర్. నూరుల్లా(హిందూపురం), షేక్ షాజహాన్ ( హిందూపురం)ను నియమించారు.


