టీడీపీ కౌన్సిలర్ వేధిస్తున్నాడు
కదిరి టౌన్: మున్సిపల్ పరిధిలోని 24వ వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ అల్ఫా ముస్తఫా ఏడాది నుంచి వేధిస్తున్నడని అదే వార్డుకు చెందిన రూక్సానా కన్నీరు మున్నీరైంది. వివరాలు ఇలా.. మున్సిపల్ పరిధిలోని 24 వార్డులో సర్వే నంబర్ 682–3సీలో రుక్సానాకు 15 అడుగుల స్థలం ఉంది. వార్డులో ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో 7 అడుగుల జాగలో నిర్మాణం చేపడుతుండగా అధికారం బలంతో సచివాలయ ఉద్యోగులను పంపి నిర్మాణాం చేపట్టుకుండా అడ్డుపడుతున్నారని రుక్సానా ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త అరీఫుల్లా చనిపోయాడని, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని బతకడానికి కష్టంగా ఉన్న తరుణంలో తమ స్థలంలో నిర్మాణం చేపడుతుంటే టీడీపీ కౌన్సిలర్ అల్ఫా ముస్తఫా అడ్డుకుంటున్నాడన్నారు. తాము వైఎస్సార్‌సీపీ అన్న ఒకే ఉద్దేశంతో ఇబ్బంది పెడుతున్నాడని వాపోయారు. దీనిపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. నిర్మాణాలు పడకొట్టాలని జేసీబీని తీసుకొచ్చారని, పడగొట్టడం ఖాయం దిక్కున్న చోట చెప్పుకోండని భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. దీంతో రుక్సానా రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని కోరారు.


