అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి
హిందూపురం: శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని, ఎస్పీ సతీష్‌కుమార్ పోలీసులను ఆదేశించారు. గురువారం ఆయన హిందూపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలతోపాటు లాకప్ గదులు, మహిళా హెల్ప్ డెస్క్, కంప్యూటర్ గదిని పరిశీలించారు. రికార్డు గదిని పరిశీలించి కేసులకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, కేసుల దర్యాప్తు, పురోగతి గురించి ఆరా తీయడంతో పాటు అందుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. అసాంఘిక కార్యక్రమాలకు ఏమాత్రమూ తావులేకుండా చూడాలన్నారు. రాత్రి వేళల్లో డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేయాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేసి చోరీలకు అడ్డుకట్ట వేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పెంచడంతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలన్నారు. అలాగే పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించే వారి సమస్యలను పూర్తిగా విని పరిష్కారం చూపాలన్నారు. గంజాయి, పేకాట వంటి వాటిపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ వెంట టూటౌన్ సీఐ కరీం, ఎస్‌ఐలు లింగన్న, నాగ ప్రసన్న పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పోలీసులకు
ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశం


