లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే | - | Sakshi
Sakshi News home page

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే

Feb 1 2026 3:04 AM | Updated on Feb 1 2026 3:04 AM

లడ్డూ

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే

పుట్టపర్తి: తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సాగిన ప్రచారం ‘పచ్చ’ నేతల కుట్రేనని వైఎస్సార్‌ సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం తిరుమల వెంకన్న ప్రసాదాన్ని వాడుకోవడం దుర్మార్గమన్నారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ కాలేదంటూ సీబీఐ ఆధ్వర్యంలోని సిట్‌ ఇచ్చిన నివేదిక చూసైనా వారు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ‘కల్తీ నెయ్యి’ అంటూ కూటమి నేతలు చేసిన ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం వైఎస్సార్‌ సీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేశారు. రాజకీయం కోసం ఎంతకై నా దిగజారి ప్రవర్తించే కూటమి పార్టీల నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించమని దేవుళ్లను వేడుకున్నారు. పలు నియోజకవర్గాల్లో పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ‘‘నెయ్యి కాదు కల్తీ..చంద్రబాబు రాజకీయం కల్తీ’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

పుట్టపర్తిలో హనుమంతునికి పూజలు..

మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సూచన మేరకు పుట్టపర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు పుట్టపర్తి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. తిరుమల లడ్డూకు వాడే నెయ్యిపై కూటమి నేతల విష ప్రచారాలను ఖండించారు. మోసం, అబద్ధాలు, కుట్రలతో పాలన సాగిస్తున్న కూటమి నేతలు సీబీఐ చార్జ్‌ షీట్‌ చూసైనా మారాలని, గత జగన్‌ సర్కార్‌ పై విషం చిమ్మడం మానుకోవాలని సూచించారు. అంతకుముందు హనుమాన్‌ సర్కిల్‌లో కూటమి కుట్రలపై ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్‌ కేశవరెడ్డి, ఎంపీపీ రమణారెడ్డి, పుట్టపర్తి పట్టణ కన్వీనర్‌ రవినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

హిందూపురంలో..

తమ స్వార్థం కోసం కలియుగ దైవాన్ని రాజకీయాల్లోకి లాగిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ అంటూ హిందూపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త టీఎన్‌ దీపిక, పార్టీ నేత వేణురెడ్డి తదితరులు దేవ దేవుడిని కోరుకున్నారు. శనివారం వారు స్థానిక పేట వేంకటరమణ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ‘చంద్రబాబు అండ్‌ కో’ తిరుమల లడ్డూపై అసత్య, విష ప్రచారాలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. సీబీఐ ఇచ్చిన చార్జ్‌ షీట్‌ చూసైనా కూటమి నేతల విష ప్రచారం మానుకోలేదన్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజం లేదని సీబీఐ తేల్చి చెప్పిందన్నారు.

కదిరిలో...

తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నానా యాగీ చేసిన కూటమి నేతలకు కనీసం సీబీఐ ఆధ్వర్యంలోని సిట్‌ వేసిన చార్జ్‌ షీట్‌ చూసైనా బుద్ధి రావాలని వైఎస్సార్‌ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బూల్‌ అన్నారు. శనివారం పార్టీ నేతలతో కలిసి స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పచ్చ బ్యాచ్‌కు బుద్ధిరావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుమల లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యి కల్తీ కాలేదని సీబీఐ చార్జ్‌ షీట్‌లో పేర్కొందని, ఇంతకంటే రుజువులు ఏమి ఉంటాయని మక్బూల్‌ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాష తదితరులు పాల్గొన్నారు.

మడకశిరలో..

తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు చేసిన విష ప్రచారానికి వ్యతిరేకంగా మడకశిర నియోజకవర్గం పరిధిలోని అమారాపురంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘కల్తీ నెయ్యి’ అంటూ సీఎం చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న అసత్యపు ప్రచారాలను తప్పుపట్టారు. నెయ్యి కల్తీ జరగలేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థ సీబీఐ స్పష్టం చేసినప్పటికీ... కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేసి కూటమి నేతలు కోట్లాది మంది భక్తులను త ప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

ధర్మవరంలో...

కూటమి నేతల కుట్రలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ నాయకులు శనివారం ధర్మవరం చెన్నకేశస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ ఆధ్వర్యంలోని సిట్‌ తేల్చిచెప్పిందని, ‘కల్తీ నెయ్యి’ అంటూ ఆరోణలు చేసిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్నారు. నీచ రాజకీయాల కోసం కలియుగ దైవం వెంకన్న ప్రసాదాన్ని వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఇకనైనా ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కుళ్లాయప్ప, పురుషోత్తమరెడ్డి, శ్రీనివాసులు, పార్టీ జిల్లా నేతలు గుర్రం శ్రీనివాసరెడ్డి, చందమూరి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తిరుమల లడ్డూకు వాడే ‘నెయ్యి కల్తీ’

ప్రచారంపై వైఎస్సార్‌ సీపీ నేతల కన్నెర్ర

రాజకీయ ప్రయోజనం కోసం వెంకన్న

ప్రసాదాన్ని వాడుకోవడంపై ఆగ్రహం

కూటమి నేతలకు మంచి బుద్ధి

ప్రసాదించాలని ఆలయాల్లో పూజలు

ప్లకార్డులు ప్రదర్శిస్తూ

జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే 1
1/5

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే 2
2/5

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే 3
3/5

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే 4
4/5

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే 5
5/5

లడ్డూపై ప్రచారం ‘పచ్చ’ కుట్రే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement