చిన్నారులపై కుక్కల దాడి
కణేకల్లు: వీధికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మాల్యం గ్రామంలో ఆదివారం నాలుగేళ్ల బాలుడు అలీబాషా ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి. ముఖంపై కరిచి గాయపరిచాయి. ఇక కణేకల్లులోని రామనగర్ భువనేశ్వర్ అనే నాలుగేళ్ల బాలుడు తన ఇంటి ముందు నిల్చుని ఉండగా కుక్కలు దాడిచేయడంతో గాయపడ్డాడు. వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రాణాలు పోతే తప్ప చలనం రాదా అని ప్రశ్నిస్తున్నారు.


