అరటి తోట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

అరటి తోట దగ్ధం

Feb 2 2026 7:11 AM | Updated on Feb 2 2026 7:11 AM

అరటి

అరటి తోట దగ్ధం

ధర్మవరం రూరల్‌: మండలంలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన రైతు గుట్టూరు నారాయణస్వామి సాగు చేసిన అరటి తోట ఆదివారం సాయంత్రం అగ్నికి ఆహుతైంది తనకున్న 3 ఎకరాల్లో 3 వేల అరటి చెట్లను సాగు చేశాడు. ప్రస్తుతం రెండో పంట మొగ్గ దశలో ఉంది. పొలం సమీపంలోని ఎండుగడ్డికి ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు తోటకు వ్యాపించి 1,500 చెట్లు కాలిపోయాయి. రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.

సర్వేయర్ల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

పుట్టపర్తి టౌన్‌: జిల్లా సర్వేయర్ల ఉద్యోగ సంఘం ఎన్నిక ఆదివారం పుట్టపర్తిలోని సాయిరామంలో నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సురేష్‌, దినేష్‌రెడ్డి వ్యవహరించారు. అధ్యక్షుడిగా వినోద్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రెడ్డిశేఖర్‌, సెక్రటరీగా ప్రదీప్‌, జాయింట్‌ సెక్రటరీగా సురేష్‌, ట్రెజరర్‌గా అయూబ్‌ఖాన్‌, కార్యవర్గ సభ్యులుగా బాబ్జాన్‌, షరీన్‌, నందిని, అపర్ణారెడ్డి, హరీష్‌కుమార్‌, నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఉగాదికై నా హామీలు నెరవేరేనా?

వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి

పుట్టపర్తి అర్బన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఉగాది నాటికై నా నెరవేర్చేరా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా నేటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. పీఆర్సీ ఊసే లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు విడుదల చేయాలన్నారు. తక్షణమే పీఆర్సీని ప్రకటించి, 30 ఐఆర్‌ ఇవ్వాలన్నారు. ఆర్థిక, ఆర్థికేతర హామీలను అమలు చేయాలన్నారు.

వైభవంగా గిరి రఽథోత్సవం

పుట్టపర్తిటౌన్‌: పౌర్ణమి సందర్భంగా ఆదివారం సత్యసాయి గిరి రథోత్సవం వైభవంగా సాగింది. అందంగా అలకరించిన రథంలో సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రశాంతినిలయం ముఖ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్‌కూడలి, ెపెట్రోల్‌బంక్‌, చింతతోపు, శివాలయం వీధి, గోవిందయ్యపేట, పెద్దబజార్‌ మీదుగా ఊరేగింపుగా ప్రశాంతినిలయానికి చేర్చారు. రథోత్సవంలో దేశవిదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భక్తులతో పోటెత్తిన ‘అశ్వత్థం’

పెద్దపప్పూరు: మండలంలోని చిన్నపప్పూరు వద్ద వెలసిన అశ్వత్థ నారాయణ స్వామి క్షేత్రం మాఘ మాసం రెండో ఆదివారం సందర్భంగా భక్తుతో పోలెత్తింది. పెన్నా నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత స్వామి వారిని భక్తులు సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుబడిలో భాగంగా ధర్మావరానికి చెందిన ఎల్లప్ప దేవేంద్రప్ప అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ సుబ్రహ్మణ్యం, చైర్మన్‌ శివ శంకర్‌రెడ్డి పర్యవేక్షించారు.

అరటి తోట దగ్ధం1
1/4

అరటి తోట దగ్ధం

అరటి తోట దగ్ధం2
2/4

అరటి తోట దగ్ధం

అరటి తోట దగ్ధం3
3/4

అరటి తోట దగ్ధం

అరటి తోట దగ్ధం4
4/4

అరటి తోట దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement