చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా వెంకటకృష్ణ
అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ – ఇండస్ట్రీస్ చైర్మన్‌గా అనంతపురానికి చెందిన వంకదారు వెంకటకృష్ణ ఆదివారం నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ ఎఫ్‌సీసీఐ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా తరఫున ఎంపికై న గోపా జగదీష్, ప్రధాన కార్యదర్శిగా గుత్తి మాకం శ్రీకాంత్, కళ్యాణదుర్గం జయం విశ్వనాథ్, గుంతకల్లు సత్రశాల విష్ణు చైతన్య తదితరులు కూడా బాధ్యతలు స్వీకరించారు.
4న హిందూపురంలో మెగా జాబ్‌మేళా
ప్రశాంతినిలయం: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 4న హిందూపురంలోని ఎస్‌డీజీఎస్, ఎంబీఏ కాలేజీలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు. 12 బహుళజాతి కంపెనీల ప్రతినిధులు పాల్గొని, ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నాయి. పదోతరగతి, డిప్లొమా, బీ–ఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, బీటెక్, పీజీ చదివి, 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయస్సున్న వారు అర్హులు. వెంట విద్యార్హత పత్రాలు, నకళ్లు, ఆధార్, రెండు ఫొటోలు తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు 96767 06976, 99594 16770 లో సంప్రదించవచ్చు.
జాతీయ సమైక్యత శిబిరానికి ఎన్‌ఎస్‌పీఆర్ విద్యార్ధి
హిందూపురం టౌన్: ఈ నెల 8 వరకు తేదీ వరకు బెంగళూరులోని రేవా యూనివర్సిటీలో వారం రోజుల పాటు జరిగే జాతీయ సమైక్యతా శిబిరానికి హిందూపురంలోని ఎన్‌ఎస్‌పీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బీకామ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని యశోద ఎంపికై ంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రగతి ఆదివారం వెల్లడించారు. ఎస్‌కే యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం నుంచి ఏపీ తరఫున ఆమె పాల్గొంటున్నట్లు వివరించారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, వికసిత్ భారత్, తదితర అనేక సామాజిక అంశాలపై చర్చా గోష్టి లు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివరిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధినిని ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ వెంకటేషులు, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి, అధ్యాపకులు శ్రీధర్, ఎన్‌సీసీ ఆఫీసర్ సరస్వతి, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ రంగనాయకులు, అధ్యాపకులు అభినందించారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా వెంకటకృష్ణ


