ఇసుక అక్రమ రవాణాపై రైతన్నల ఆగ్రహం
రొద్దం: అధికార పార్టీ అండదండలతో కొందరు ఇసుక అక్రమ రవాణాను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పెన్నమ్మను తూర్పారబడుతూ ఇసుకను అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఫలితంగా భూగర్భ జలమట్టం తగ్గి బోర్లు ఒట్టిపోయి సాగునీటికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇసుకను తరలించవద్దని వేడుకున్నా ఇసుకాసురులు వినిపించుకోలేదు. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులపై రైతులు కన్నెర్ర జేశారు. శనివారం మండల కేంద్రంలోని పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను అడ్డుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా పెన్నానదిలో ఇసుక తవ్వకాల కోసం ఇసుక అక్రమ రవాణాదారులు వేసిన రోడ్డును జేసీబీతో ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్లను స్టేషన్‌ను తరలించారు. అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన
అక్రమార్కులను పోలీసులకు
అప్పగించిన వైనం
ఇసుక అక్రమ రవాణాపై రైతన్నల ఆగ్రహం


