చివర్లో పెరిగిన చలిగింతలు | - | Sakshi
Sakshi News home page

చివర్లో పెరిగిన చలిగింతలు

Feb 1 2026 3:04 AM | Updated on Feb 1 2026 3:04 AM

చివర్

చివర్లో పెరిగిన చలిగింతలు

తనకల్లులో 9.4 డిగ్రీలు,

రాప్తాడులో 12.4 డిగ్రీలు

అనంతపురం అగ్రికల్చర్‌: సీజన్‌ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ‘చలి’ గింతలు పెరిగాయి. వారం రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుంచి 18 డిగ్రీల మధ్య నమోదు కావడంతో చలి తగ్గుముఖం పడుతూ వచ్చింది. అయితే వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు మళ్లీ 10 నుంచి 15 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో చలి వాతావరణం పెరిగింది. ఉదయం పూట పొగమంచు ఆవరిస్తోంది. శనివారం శ్రీసత్యసాయి జిల్లా తనకల్లులో 9.4 డిగ్రీలు, గాండ్లపెంటలో 9.8 డిగ్రీలు, మడకశిరలో 10.1 డిగ్రీలు.. ఇలా కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు అనంతపురం జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోగా చలి ప్రభావం కనిపిస్తోంది. ఈనెల 15 వరకు ఉదయం పొగమంచు, చలి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పంపిణీకి పాసు పుస్తకాలు

సిద్ధం చేయాలి

ప్రశాంతి నిలయం: రీసర్వే పూర్తయి ఇప్పటికే డ్రాఫ్ట్‌ పాసు పుస్తకాలు అందించిన గ్రామాల్లోని రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం ఆయన ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...జిల్లా వ్యాప్తంగా ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకూ గ్రామల్లో సభలు ఏర్పాటు చేసి రైతులకు క్యూర్‌ కోడ్‌తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో పంపిణీ చేయాల్సిన పాసు పుస్తకాల్లో పట్టాదారు వివరాలు, పొలం విస్తీర్ణం తదితర వివరాలతో పాటు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

గస్తీ పెంచండి..

చోరీలు నియంత్రించండి

నేర సమీక్షలో ఎస్పీ ఆదేశం

పుట్టపర్తి టౌన్‌: గస్తీ పెంచి చోరీలను పూర్తిగా నియంత్రించాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. అలాగే ప్రాపర్టీ కేసుల్లో రికవరీ శాతం పెంచాలన్నారు. శనివారం ఆయన స్థానిక సాయి ఆరామంలో అన్ని సబ్‌ డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, చోరీల నివారణ, గ్రేవ్‌, నాన్‌గ్రేవ్‌, మర్డర్‌, ప్రాపర్టీ, చీటింగ్‌, రోడ్డు యాక్సిడెంట్‌ కేసుల గురించి చర్చించి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం వివిధ కేసుల ఛేదింపులో ప్రతిభ కనబరిచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం వివిధ కేసుల దర్యాప్తులో లీగల్‌గా ఎదురయ్యే సమస్యల గురించి పుట్టపర్తి జడ్జి ముజీజ్‌ సయ్యద్‌ పోలీస్‌ అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... పెండింగ్‌ కేసుల ఛేదింపులో పురోగతి సాధించాలన్నారు. చోరీల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నూతన ఎస్‌ఐలు మరింత ఽబాధ్యతగా పనిచేయాలన్నారు. ఆర్టీసీ బప్టాండ్‌లో చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విజుబుల్‌ పోలీసింగ్‌తో పాటు నైట్‌ విజన్‌ డ్రోన్లతో నిఘా పెంచాలన్నారు. అలాగే గ్రామ సందర్శనలు, పల్లె నిద్రలు చేపట్టి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే నేరస్తులను జిల్లా నుంచి బహిష్కరించేందుకు సిఫార్సు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి శాఖ ప్రతిష్ట పెంచాలన్నారు. కార్యక్రమంలో పోలీసు లీగల్‌ అడ్వయిజర్‌ సాయినాథ్‌రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్‌, మహేష్‌, హేమంత్‌కుమార్‌, నర్సింగప్ప, శివన్నారాయస్వామి, ఇందిరతో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

చివర్లో పెరిగిన చలిగింతలు 1
1/2

చివర్లో పెరిగిన చలిగింతలు

చివర్లో పెరిగిన చలిగింతలు 2
2/2

చివర్లో పెరిగిన చలిగింతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement