రాష్ట్రంలో ఆటవిక పాలన
● మాజీ మంత్రి శంకరనారాయణ ధ్వజం
సాక్షి పుట్టపర్తి: దాడులు, విధ్వంసాలు, హత్యలతో రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు మాలగుండ్ల శంకర నారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు పట్టపగలే దాడికి పాల్పడడం చంద్రబాబు విధ్వంసక పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయన్నారు. తిరుమల లడ్డూ విషయంలో సిట్ పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చిందని, ఈ క్రమంలో వైఎస్సార్ సీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందనే అక్కసుతో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపార న్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో, సరైన రీతిలో గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.


