డ్వాక్రా మహిళకు టోకరా
హిందూపురం: పట్టణంలోని ఎస్‌బీఐ ధనలక్ష్మి రోడ్డు బ్రాంచ్‌లో కొట్టిపి గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళ గంగరత్నమ్మను ఓ మోసగాడు బురిడి కొట్టించి రూ.50 వేలు కాజేశాడు. వివరాల్లోకెళితే... గంగ రత్నమ్మ సంఘం అకౌంట్‌లో డబ్బులు జమ చేయడానికి 15 రోజుల క్రితం ఎస్‌బీఐ ధనలక్ష్మి రోడ్డు బ్రాంచ్‌కు వచ్చింది. ఆమెకు చదవడం, రాయడం రాకపోవడంతో అక్కడే ఉన్న గుర్తుతెలియని ఓ వ్యక్తికి ఫారం నింపి ఇవ్వాలని కోరింది. దీన్ని అదునుగా తీసుకున్న ఆ వ్యక్తి ఫారంలో తన సొంత ఖాతాకు రూ.50 వేలు పడేలా రాసిచ్చాడు. దీంతో ఈమె నేరుగా కౌంటర్‌లో ఫారం అందించింది. ఇప్పుడు తాజాగా మహిళా సంఘం సభ్యులు సమావేశమయ్యారు. స్లిప్ తప్పుగా ఉండటంతో అందరూ గంగరత్నమ్మను ప్రశ్నించారు. ఆమె బ్యాంకు అధికారులను సంప్రదించింది. స్వయంగా మీరే బ్యాంకులో నగదు జమ చేశారని వారు సమాధానం ఇచ్చారు. అతను వెంటనే డ్రా కూడా చేసుకున్నాడని చెప్పారు. దీంతో మహిళా సంఘం సభ్యులు టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఖాతా వివరాలు మార్చి
రూ.50 వేలు డ్రా
లబోదిబోమంటున్న
మహిళా సంఘం సభ్యులు


