సెపక్‌తక్రా పోటీల్లో విజేత ఉరవకొండ
ఉరవకొండ: స్థానిక ప్రభుత్వ సెంట్రల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా ఆదివారం ప్రారంభమైన అస్మిత సెపక్ తక్రా ఖేలో ఇండియా పోటీల్లో ఉరవకొండ క్రీడాకారులు ప్రతిభ చూపి జిల్లా విజేతగా నిలిచారు. పోటీలను అఖిల భారత సెపక్‌తక్రా ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 18 జట్లు తలపడ్డాయి. సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఉరవకొండ సెంట్రల్ ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. రెండో స్థానంలో కరకముక్కల జెడ్పీహెచ్‌ఎస్ జట్టు, మూడో స్థానంలో తట్రకల్లు కేజీబీవీ జట్టు నిలిచాయి. జూనియర్ బాలిక విభాగంలో తట్రకల్లు కేజీబీవీ జట్టు మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో ఉరవకొండ సెంట్రల్ పాఠశాల జట్టు, మూడో స్ధానంలో కరకముక్కల జెడ్పీహెచ్‌ఎస్‌జట్టు నిలిచాయి. విజేతలకు ట్రోఫీలను ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్, మహేశ్వరీ, సెపక్‌తక్రా జిల్లా అధ్యక్షుడు షాహిన్, పీడీలు మారుతీప్రసాద్, అనిత, రుద్ర, మౌనిక పాల్గొన్నారు.
సెపక్‌తక్రా పోటీల్లో విజేత ఉరవకొండ


