వైభవం.. రంగనాథుడి రథోత్సవం
గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా సాగింది. వేకువజామునే ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడి ఉత్సవ మూర్తుల కల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. సాయంత్రం ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై అధిష్టించారు. ప్రత్యేక పూజల అనంతరం రథోత్సవాన్ని ఎమ్మెల్యే జయరాం, ఈఓ శోభ ప్రారంభించారు. వేలాది మంది భక్తులు రంగనాథ స్వామి నామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు లాగారు. ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి.
వైభవం.. రంగనాథుడి రథోత్సవం


